Header Banner

దోహాలో ఘనంగా మినీ మహానాడు మరియు ఎన్.టి.ఆర్ జయంతి వేడుకలు! రాజకీయాలలో కీలక మార్పులు..

  Tue May 27, 2025 22:04        Politics, World

తెలుగుదేశం పార్టీ పండుగ మినీ మహానాడు మరియు తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, తెలుగు  వారి కీర్తిని దశ దిశలు వ్యాపింప చేసిన నందమూరి తారక రాముని 102వ  జయంతి వేడుకలు ఖతార్ రాజధాని దోహాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కోడెల శివరామకృష్ణ హాజరైనారు. ఎన్.టి.ఆర్ కు ఘననివాళులు అర్పించి, మాతెలుగుతల్లికి మల్లెపూదండ గీతాలాపనతో ప్రారంభమైన సభ ఎంతో ఉత్సహంగా, ఉల్లాసంగా  పండుగ వాతావరంలొ  సాగింది. ఈసందర్బంగా “తారకరామం” పుస్తకఆవిష్కరణ విశిష్ట అతిధి చేతుల మీదగా జరిగింది.

ఈసందర్భంగా కోడెల శివరామకృష్ణ ప్రసంగిస్తూ. ఎన్.టి.ఆర్ కారణ జన్ముడని తెలువారి ఆత్మ గౌరవం ఢిల్లీ విధుల్లో తాకట్టు పెట్టబడుతుంటే తట్టుకోలేక, బడుగు బలహీన వర్గాల వారు ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే ఓరిమి పట్టలేక తెలుగుదేశం పార్టీని స్థాపించి 9  నెలల కాలంలోనే అధికారం చేపట్టారని గుర్తుచేశారు.. అయన ప్రారంభించిన సంక్షేమ పథకాలు, కూడు, గుడ్డ, గూడు, రైతులకు ఉచిత విదుత్ వంటి పథకాలు దేశానికే ఆదర్శప్రాయం అయ్యాయని వివరించారు. ఎన్.టి.ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ.. రాష్ట్రాన్ని అధివృద్ధి పదంలో నడిపించటానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ప్రపంచానికే ఆదర్శప్రాయమని శ్రోతలకు వివరించారు.. 1982 లో  ఎన్.టి.ఆర్ పార్టీ స్థాపించి రాజకీయాలలో కీలక మార్పులు తీసుకురావాలనే లక్షసాధనలో విద్యావేత్తలు, సమాజంలో ఉన్నతమైన వారికోసం చూస్తున్న తరుణంలో, తన తండ్రి కోడెల శివప్రసాద్ గురించి తెలుసుకొని పార్టీలోకి ఆహ్వానించి సముచిత స్థానమిచ్చి గౌరవించారని చెప్పుకొచ్చారు.. కోడెల శివప్రసాద్ కూడా తనొకొచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఒకవైపు పార్టీని కార్యకర్తలని కాపాడుకొంటూ అభివృద్ధి పదంలో సాగేందుకు చేసిన కృషి నేటి తరానికి ఆదర్శ ప్రాయమన్నారు, లక్ష మరుగుదొడ్ల నిర్మాణం లిమ్కా బుక్  అఫ్ వరల్డ్ రికార్డ్స్ తోపాటు గిన్నిస్ బూన్ అఫ్ వరల్డ్ రికార్డు అని చెప్పుకొచ్చారు. 

 

WhatsApp Image 2025-05-27 at 21.20.03_92aa6ef5.jpg

తన ప్రాణమున్నంత వరకు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తానని, కొన్ని కష్టాలొచ్చినప్పుడు పార్టీని  మార్చటమంటే అది కన్నతల్లిని మార్చటమేనని చెప్పుకొచ్చారు. తన మొబైల్  ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని తనకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చని .. అందరికి తాను  ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని హామీనిచ్చారు . ఈకార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించిన ఖతార్ కార్యవర్గాన్ని ముఖ్యంగా ఖతార్ ప్రెసిడెంట్ గొట్టిపాటి  రమణయ్య , వైస్ ప్రెసిడెంట్ మద్దిపోటి  నరేష్, జనరల్ సెక్రటరీ  పొనుగుమాటి రవి, జీసీసీ కౌన్సిల్ మెంబెర్ మల్లిరెడ్డి సత్యనారాయణ, ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ దాసరి రమేష్, సీనియర్  నాయకులు ఎలమంచిలి శాంతయ్య, నరసింహారావు తదితరులను అభినందించారు. ఈసందర్బంగా దోహా నుంచి గన్నవరం కు డైరెక్ట్ ఫ్లైట్ సదుపాయాన్ని కల్పించడానికి చొరవ తీసుకోవాలని విషిష్ట అతిథికి వినతి పత్రాన్ని ఖతార్ టీం అందించింది.

 

ఇది కూడా చదవండి: కూటమి ప్రభుత్వ లక్ష్యం అదే.. మంత్రి కీలక వ్యాఖ్యలు! అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..

 

NRI టీడీపీ ఖతార్ ప్రెసిడెంట్  గొట్టిపాటి రమణయ్య ప్రసంగిస్తూ..  ఖతార్‌లో ఉన్న వేలాది మంది తెలుగు ప్రవాసులకు — ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు మరియు పండగల సమయంలో ప్రయోజనంగా ఉండేలా, దోహా నుండి విజయవాడకు నేరుగా విమాన మార్గం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖను మనవి చేస్తున్నాము. అలాగే ప్రవాస భారతీయుల సమస్యలు పరిష్కరించే విధంగా, టీడీపీ జాతీయ మరియు రాష్ట్ర స్థాయి కమిటీల్లో NRI టీడీపీ ఖతార్‌కు చురుకైన పాత్ర ఇవ్వాలని మనవి చేసారు.

వైస్ ప్రెసిడెంట్ మద్దిపోటి  నరేష్, జనరల్ సెక్రటరీ పొనుగుమాటి రవి, జీసీసీ కౌన్సిల్ సభ్యులు మల్లిరెడ్డి సత్యనారాయణ, ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ దాసరి రమేష్, సీనియర్  నాయకులు ఎలమంచిలి శాంతయ్య, దేవినేని పృజ్వల, డాక్టర్ రాధా పత్తిపాటి, ప్రమోద్, మోడీ ఆంజనేయలు, తిరుపాలు, నాని, నాయుడు, పూర్ణచంద్రరావు, అయ్యన్న, కళ్యాణ్, గోపాల్ రాజు  తరులు ప్రసంగిస్తూ .. ఆర్ధికంగా సంశోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడినపెట్టే పనిలో తలమునకలైన యాన్ డి ఏ ప్రభుత్వానికి ప్రతిఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. అమరావతి రాజధాని కల నెరవేరేదిశగా అడుగులు వేస్తున్న ప్రజాప్రభుత్వానికి ప్రవాసులు సహకరించాలని పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చేలా తమవంతు కృషిచేయనాలి పిలుపునిచ్చారు. ఏర్పాటు చేసిన భారీ కేక్ ను విశిష్ట అతిధి  కట్ చేసి అందరికి పంచారు. గ్రూప్ ఫొటోలతో, జై తెలుగుదేశం.. జోహార్ యాన్ టి ఆర్ నినాదాలతో సభను దిగ్విజయవంతంగా ముగించారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!

 

వల్లభనేని వంశీకి దెబ్బపై దెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత!

        

అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి షాక్! 14 రోజుల రిమాండ్..

 

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ!

 

వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

 

కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!

 

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #MiniMahanadu #NTRJayanti #Celebrations #Doha #TDPLeaders #Viral